సిగ్నిటీ టెక్నాలజీ, ఆటమ్​లకు అవార్డు

సిగ్నిటీ టెక్నాలజీ, ఆటమ్​లకు అవార్డు

హైదరాబాద్​, వెలుగు : డిజిటల్​ ఇంజనీరింగ్‌ కంపెనీ సిగ్నిటీ టెక్నాలజీస్​, యూకేకు చెందిన యాప్​ బేస్డ్ ​బ్యాంక్​ ఆటమ్​లకు ‘టెస్టింగ్​ టీమ్​ ఆఫ్​ ది ఇయర్​’ అవార్డు దక్కింది. లండన్‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన యూరోపియన్ సాఫ్ట్‌‌‌‌వేర్ టెస్టింగ్ అవార్డ్స్ (టెస్టా)లో వీటికి ఈ గౌరవం దక్కింది. సిగ్నిటీ భాగస్వామ్యంతో ఆటమ్ బ్యాంక్ కూడా మూడు విభాగాల్లో ఫైనలిస్ట్‌‌‌‌గా ఎంపికయింది.

ఇవి: ‘బెస్ట్ టెస్ట్ ఆటోమేషన్ ప్రాజెక్ట్ - ఫంక్షనల్’, ‘టెస్టింగ్ టీమ్ ఆఫ్ ది ఇయర్’,  ‘మోస్ట్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్’. సాఫ్ట్‌‌‌‌వేర్ టెస్టింగ్, క్వాలిటీ అస్యూరెన్స్ స్పేస్‌‌‌‌లో గణనీయమైన విజయాలు సాధించిన కంపెనీలకు, వ్యక్తులకు ఈ అవార్డులు ఇస్తారు.  తమ టీమ్​ బాగా పనిచేయడం వల్ల, సమస్యలను పరిష్కరించే స్కిల్స్​ను పెంచుకోవడం వల్ల ఈ అవార్డు వచ్చిందని సిగ్నిటీ టెక్నాలజీస్​ సీఈఓ చక్కిలం శ్రీకాంత్​ అన్నారు. ఆటమ్​ బ్యాంకు సీటీఓ ఆండీ స్టరక్​ మాట్లాడుతూ తమ 4.5 బిలియన్​ పౌండ్ల విలువైన డిపాజిట్లు, 4.7 ట్రస్ట్​పైలట్​ రేటింగ్​ఉందని అన్నారు.