
ముషీరాబాద్, వెలుగు: బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్బీఆర్ అంబేద్కర్ లా కాలేజీలో మంగళవారం కొత్త క్రిమినల్ చట్టాలపై ఎక్స్ పర్ట్ టాక్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఓయూ లా కాలేజీ డీన్ విజయలక్ష్మి, ప్రిన్సిపాల్ రాధిక యాదవ్, రాంప్రసాద్ పాల్గొని దేశ న్యాయ వ్యవస్థ ఏర్పాటు, ప్రస్తుతం న్యాయ వ్యవస్థలో వస్తున్న మార్పులను విద్యార్థులకు వివరించారు.
కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ లా కాలేజీ ప్రిన్సిపల్ సృజన, పద్మజ, శిరీష, స్టూడెంట్లు పాల్గొన్నారు.