ఇన్ స్టా మార్ట్ తో YISU జోడీ .. ఐదు వేల మందికి జాబ్స్

ఇన్ స్టా మార్ట్ తో YISU జోడీ .. ఐదు వేల మందికి జాబ్స్

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణ యువతకు క్విక్ కామర్స్ రంగంలో ఉపాధి కల్పించేందుకు ఇన్ స్టామార్ట్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (వైఐఎస్​యూ) చేతులు కలిపాయి. ఈ ఒప్పందం ద్వారా ఐదు వేల మంది యువతకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. మూడు నెలల పాటు సాగే ఈ విద్యా కార్యక్రమం ద్వారా సప్లై చైన్, లాజిస్టిక్స్, స్టోర్ మేనేజ్​మెంట్​పై శిక్షణ ఇస్తారు. 

తెలంగాణ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. స్విగ్గీ హెచ్ఆర్ హెడ్ గిరీష్ మీనన్, యూనివర్సిటీ వీసీ సుబ్బారావు సమక్షంలో ఎంఓయూ కుదిరింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఇన్ స్టామార్ట్ మద్దతుతో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తారు. క్విక్ కామర్స్ రంగంలో పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా నైపుణ్యం కలిగిన సిబ్బందిని తయారు చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి స్టోర్ మేనేజర్, ట్రైనీలుగా ఉపాధి లభిస్తుంది.