IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ దూరం..? రీప్లేస్ మెంట్ ఎవరంటే..?

IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ దూరం..? రీప్లేస్ మెంట్ ఎవరంటే..?

ఆసియా కప్ లో ఇండియా- పాకిస్థాన్ మరోసారి తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. సూపర్-4 లో భాగంగా దాయాధి జట్లు ఆదివారం (సెప్టెంబర్ 21) దుబాయ్ వేదికగా మ్యాచ్ ఆడనున్నారు. టోర్నీలో తిరుగులేకుండా ఆడుతున్న టీమిండియా ఈ మ్యాచ్ లో క్లియర్ ఫేవరేట్ గా బరిలోకి దిగనుంది. సూపర్-4 లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్ లో గెలిస్తే మిగిలిన రెండు మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్ భారీ తేడాతో గెలిస్తే ఫైనల్ కు వెళ్లొచ్చు. బలహీనమైన పాకిస్థాన్ పై టీమిండియా మరోసారి ఆధిపత్యం చూపించాలని చూస్తుంటే.. ఈ సారి ఎలాగైనా ఇండియాకు షాక్ ఇవ్వాలని పాకిస్థాన్ గట్టి పట్టుదలతో కనిపిస్తోంది.  

ఈ కీలక మ్యాచ్ కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్. స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ పాకిస్థాన్ తో జరగబోయే మ్యాచ్ కు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం (సెప్టెంబర్ 19) ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేసే క్రమంలో అక్షర్ తలకు గాయమైంది. ఇన్నింగ్స్ 15 ఓవర్లో క్యాచ్ పడదామని డైవ్ చేయబోయి వెనక్కి పడడంతో నెలకు బలంగా తల తగిలింది. దీంతో గ్రౌండ్ లో ఇబ్బందిపడిన అక్షర్ వెంటనే డగౌట్ కు వెళ్ళాడు. అక్షర్ గాయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఈ టీమిండియా ఆల్ రౌండర్ ఒక్క రోజులో కోలుకొని రేపు మ్యాచ్ ఆడడం అనుమానంగా మారింది. 

ALSO READ : వచ్చే ఏడాది బలంగా తిరిగి వస్తా: నీరజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఒకవేళ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్ కు దూరమైతే అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారో అనే దానిపై చర్చ నడుస్తోంది. స్పెషలిస్ట్ బ్యాటర్ ను తీసుకొస్తారా.. లేకపోతే స్పెషలిస్ట్ బౌలర్ ను తీసుకుంటారో ఆసక్తికరంగా మారింది. జట్టులో కుల్దీప్ యాదవ్, వరుణ్  చక్రవర్తి  రూపంలో బలమైన స్పిన్ అటాక్ ఉండడంతో స్పెషలిస్ట్ బ్యాటర్ కే అవకాశం దక్కొచ్చు. అదే జరిగితే మిడిల్ ఆర్డర్ లో జితేష్ శర్మకు ఛాన్స్ దక్కొచ్చు. లేకపోతే హర్షిత్ రానా జట్టులోనే ఉంచి అర్షదీప్ స్థానంలో బుమ్రా.. అక్షర్ స్థానంలో వరుణ్ చక్రవర్తి జట్టులోకి రావొచ్చు. ఒమన్ తో జరిగిన మ్యాచ్ కు దూరంగా ఉన్న బుమ్రా, వరుణ్ చక్రవర్తి పాకిస్థాన్ తో మ్యాచ్ కు అందుబాటులో ఉండడనున్నారు.