ఫైనల్‌కు చేరుకున్న అయోధ్య కేసు
నేడు సుప్రీంకోర్టులో విచారణ
న్యూఢిల్లీ: సుదీర్ఘకాలం కాలం కొనసాగిన అయోధ్యలోని బాబ్రీ మసీదు, రామజన్మభూమి భూవివాదం కేసు విచారణ తుది దశకు చేరుకుంది. వారం రోజుల దసరా సెలవుల తర్వాత సుప్రీంకోర్టులో సోమవారం ఈ కేసు విచారణకు రానుంది. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాకు సమానంగా పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన 14 అప్పీళ్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఆగస్టు 6న మీడియేషన్ ఫెయిల్ కావడంతో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలోని జస్టిస్‌లు ఎస్ఏ బాబ్డే, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్ ఏ నజీర్ లతో కూడిన బెంచ్ రోజువారీ విచారణ చేపట్టింది.
18 లోపు వాదనలు ముగించాలని మొదట చెప్పిన బెంచ్ డెడ్ లైన్ ను ఒకరోజు ముందుకు జరిపింది. ఈ నెల 14లోపు ముస్లింల తరపున వాదనలు ముగించాలని, తర్వాత హిందూ పార్టీలు వాదనలు వినిపించేందుకు రెండ్రోజుల గడువు ఇస్తామని ప్రకటించింది.

