అయోధ్య ఆహ్వానాన్ని తిరస్కరించిన నేతలు

అయోధ్య ఆహ్వానాన్ని తిరస్కరించిన నేతలు

జనవరి 22న అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది.అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి తమ పార్టీ నేతలు హాజరుకావడం లేదని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది.  ఇండియా కూటమిలోని చాలా ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఈ అయోధ్య వేడుకలకు హాజరుకావడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, అధిర్ రంజన్ చౌదరిలు వేడుకలకు హాజరు కాబోవడం లేదని, అది బీజేపీ/ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలా ఉందని ఆరోపించింది.

ప్రధాని మంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ వేడుకలో రామ్ లల్లా(బాల రాముడి) ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ప్రధానితో పాటు దేశ వ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులు, సాధువులతో సహా 7000 మందికి పైగా అతిథులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు.

రామ మందిర వేడుల ఆహ్వానాన్ని తిరస్కరించిన ప్రతిపక్ష నేతలు:

  • కాంగ్రెస్: మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరి, మన్మోహన్ సింగ్

  • తృణమూల్ కాంగ్రెస్ : మమతా బెనర్జీ

  • కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్): సీతారాం ఏచూరి

  • ఆమ్ ఆద్మీ పార్టీ: అరవింద్ కేజ్రీవాల్

  • మహారాష్ట్రకు చెందిన శివసేన-(UBT): ఉద్ధవ్ ఠాక్రే

  • నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ): శరద్ పవార్

  • నేషనల్ కాన్ఫరెన్స్: ఫరూక్ అబ్దుల్లా