ఇండియాలో అతిపెద్ద టూరిస్ట్​ హాట్​స్పాట్​​గా అయోధ్య

ఇండియాలో అతిపెద్ద టూరిస్ట్​ హాట్​స్పాట్​​గా అయోధ్య

న్యూఢిల్లీ :  అయోధ్యలో రామ మందిరాన్ని  ప్రారంభించడం వల్ల ఈ నగరం ఏటా కనీసం ఐదు కోట్ల మంది పర్యాటకులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. -- స్వర్ణమందిరం,  తిరుపతికి వచ్చేవారి కంటే ఇది ఎక్కువ. ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని ఈ నగరంలో ఎయిర్​పోర్టు సహా అన్ని వసతులూ ఉన్నాయి. ఇందుకు రూ.85 వేల కోట్ల వరకు ఖర్చు చేశారు. దీంతో ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని, టూరిస్టులు భారీగా వస్తారని బ్రోకరేజ్ జెఫరీస్ ఒక నివేదికలో అంచనా వేసింది.  అమృత్‌‌‌‌‌‌‌‌సర్‌‌‌‌‌‌‌‌లోని గోల్డెన్ టెంపుల్‌‌‌‌‌‌‌‌కు సంవత్సరానికి 3.5 కోట్ల మంది వరకు వస్తారు.

తిరుపతి ఆలయాన్ని మూడు కోట్ల మంది వరకు సందర్శిస్తారు. ప్రపంచవ్యాప్తంగా, వాటికన్ నగరానికి ప్రతి సంవత్సరం 90 లక్షల మంది, సౌదీ అరేబియాలోని మక్కాకు దాదాపు రెండు కోట్ల మిలియన్ల మంది పర్యాటకులు వస్తుంటారు. భారతదేశంలో ఇప్పటికీ మతపరమైన పర్యాటకం అతిపెద్ద పర్యాటక విభాగమని జెఫరీస్​ తెలిపింది.  అయోధ్య టూరిస్ట్​ హాట్​స్పాట్​గా మారడం వల్ల హోటళ్ళు, విమానయాన సంస్థలు, ఆతిథ్యం, ఎఫ్​ఎంసీజీ, సిమెంట్ మొదలైన వాటితో సహా చాలా రంగాలు ప్రయోజనం పొందుతాయని ఈ బ్రోకరేజ్ తెలిపింది.