2023 డిసెంబర్ నుంచి రామ మందిరంలో దర్శనం

2023 డిసెంబర్ నుంచి రామ మందిరంలో దర్శనం

అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో 2023 డిసెంబర్ నుంచి భక్తులను దర్శనం కల్పించనున్నారు. అప్పటికి మందిర నిర్మాణం పూర్తి కాకపోయినప్పటికీ... భక్తులను దర్శనానికి అనుమతించాలని ట్రస్ట్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. రామ్ టెంపుల్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి కావడానికి 2025 వరకు సమయం పడుతుందని రామ జన్మభూమి ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. టెంపుల్ కాంప్లెక్స్ లో ఆలయంతో పాటు... మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్స్, రీసెర్చ్ సెంటర్ కూడా ఉంటాయని వివరించాయి.

 దీంతో పాటు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామ్ భక్తులకు పెద్ద ఆఫర్ ప్రకటించింది. రామ భక్తులందరూ ఇప్పుడు రామ మందిర నిర్మాణ పనులను అక్కడికి వెళ్లి చూడవచ్చు. దీని కోసం ఒక వ్యూపాయింట్ నిర్మించబడుతుంది. అయోధ్యకు వచ్చే భక్తులు ఆలయ నిర్మాణ పనులను తమ కళ్లతో చూడగలుగుతారు.