అయోధ్య రాముడికి కొత్త పేరు.. ఇక నుంచి ఇలానే పిలవాలి

అయోధ్య రాముడికి కొత్త పేరు.. ఇక నుంచి ఇలానే పిలవాలి

అయోధ్యలోని రామమందిరంలో కొలువుదీరిన బాలరాముడు ఇకపై  బాలక్ రామ్ గా దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. మందిరంలో కొలువుదీరిన రామ్ లల్లా ఐదేళ్ల పసిబాలుడిగా దర్శనమిస్తున్నారు. అందుకే బాలక్ రామ్ పేరును నిర్ణయించినట్లు చెప్పారు. అంతేకాకుండా.. ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్ గా పిలుస్తామని తెలిపారు.

భారతదేశంలోని ప్రతీ హిందువు గర్వపడేలా అయోధ్యలోని రామ మందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన విషయం తెలిసిందే. ఎంతో అట్టహాసంగా జరిగిన బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రపంచనలుమూల అనేక మాధ్యమాల ద్వారా వీక్షించారు. దేశ ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ ఘట్ట జరిగింది. అయితే అక్కడ కొలువైన బాల రాముడిని ఇప్పటి వరకు రామ్ లల్లా అని పిలిచారు. ఇప్పుడు బాల రాముడి పేరును మార్చారు. 

మందిరంలో కొలువైన శ్రీరాముడు ఐదేళ్ల పసిబాలుడని.. అందుకే బాలక్ రామ్(Balak Ram) పేరును నిర్ణయించినట్లు తెలిపారు. ఇకపై ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్‌గా పిలుస్తామని వెల్లడించారు. స్వామికి రోజుకు ఆరుసార్లు హారతిని ఇస్తారని ట్రస్ట్ కు నిర్వాహాకులు ఆచార్య మిథిలేశ్ నందిని తెలిపారు. మంగళ, శ్రింగార, భోగ, ఉతపన్, సంధ్యా, శయన హారతి ఇస్తామని చెప్పారు. పూరి, కూరతో పాటు పాలు, పండ్లు, రబ్ డీ ఖీర్, పాలతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తామని వివరించారు. ఇక ఈ రోజు (జనవరి 23 ) నుంచి సామాన్య ప్రజలను కూడా ఆలయానికి అనుమతించడంతో దేశ నలుమూలల నుంచి భక్తులు పోటెత్తారు.