ఆయుర్వేదం చాలా ప్రభావవంతమైంది.. ఐఎంఏకు ఆయుష్ కౌంటర్

ఆయుర్వేదం చాలా ప్రభావవంతమైంది.. ఐఎంఏకు ఆయుష్ కౌంటర్

న్యూఢిల్లీ: కరోనాను తగ్గించేందుకు యోగా, ఆయుర్వేద విధానాలను వినియోగించడంపై కేంద్రం కొత్తగా ప్రోటోకాల్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రోటోకాల్‌‌ను వ్యతిరేకిస్తూ‌ కేంద్రాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రశ్నించింది. దీనిపై ఆయుష్ బాడీ స్పందించింది. ఆయుర్వేదం చాలా పురాతనమైన స్థిరపడిన శాస్త్రం అని, ప్రభావవంతమైందని ఐఎంఏకు ఆయుష్ కౌంటర్ ఇచ్చింది.

‘ఆయుర్వేదం చాలా పురాతనమైంది. బాగా స్థిరపడిన శాస్త్రం. అలాగే ప్రభావవంతమైంది కూడా. 2010లో స్థాపించిన ఇంటిగ్రేటెడ్ మెడికల్ అసోసియేషన్ (ఆయుష్) అన్ని రాష్ట్రాల్లోనూ విస్తరించింది’ అని నేషనల్ ప్రెసిడెంట్ ఆర్‌‌పీ పరాషర్, ఫౌండర్ పత్రోన్ యువ్‌‌రాజ్ త్యాగి చెప్పారు. పలు ఆయుర్వేద, యోగా ఇన్‌‌స్టిట్యూట్స్‌‌లో కరోనా పేషెంట్స్ చికిత్స పొందుతున్నారని అసోసియేషన్ పేర్కొంది. కేంద్రం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు ఈ ట్రీట్‌‌మెంట్‌‌లో దేశవ్యాప్తంగా ఏకత్వాన్ని తీసుకురావడానికి దోహదపడతాయని తెలిపింది. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్దన్ కరో్నా ట్రీట్‌‌మెంట్‌‌కు సంబంధించి కొత్త ప్రోటోకాల్‌‌ను విడుదల చేశారు. తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్న కరోనా పేషెంట్స్‌‌‌‌తోపాటు లక్షణాలు లేని వైరస్ పేషెంట్స్‌‌కు యోగా, ఆయుర్వేద హెర్బల్స్, అశ్వగంధ పద్ధతుల్లో చికిత్స అందించేందుకు కేంద్రం అనుమతిని ఇచ్చింది.