Health Tips: ముక్కు దిబ్బడ నివారణకు వంటింటి చిట్కాలు..

Health Tips: ముక్కు దిబ్బడ నివారణకు వంటింటి చిట్కాలు..

ముక్కు దిబ్బెడ.. ఇది ఎంత బాధిస్తుందో అనుభవించిన వారికి తెలుసు. ముక్కులోని మెత్తని సైనస్ ఉబ్బడం వల్ల ముక్కు దిబ్బెడ వస్తుంది. వైరల్ ఇన్ ఫెక్షన్ వచ్చినప్పుడు రోగనిరోధక శక్తి ప్రతిస్పందనలో భాగంగా ఈ ముక్కులోని భాగం వాపుకు గురవుతుంది. దుమ్ము, ధూళి,పెంపుడు జంతువులు, కొన్ని రకాల ఆహార పదార్థాలు కలిగించే ఎలర్జీ వల్ల ప్రతిచర్యగా ముక్కు దిబ్బెడకు దారితీస్తాయి. ఇన్ ఫెక్షన్ లేదా అలెర్జీ కారణంగా సైనస్ ల వాపు సంభవించి ముక్కు మూసుకుపోతుంది. పొగ, కెమికల్స్, ఘాటైన వాసనల వంటి చికాకు కలిగించే నాసికాలైనింగ్ వాపుకు దారి తీస్తాయి. 

ముక్కు దిబ్బెడను నివారించడం ఎలా.. 

ముక్కు దిబ్బెడ నుంచి ఉపశమనం కలిగించేందుకు సాయ పడే ఆయుర్వేద, వంటింటి చిట్కాలు మనం తెలుసుకుందాం. 

1. ఆవిరి పీల్చడం.. 

యాకలిప్టస్ , పుదీనా వంటి మూలికా నూనెలతో ఆవిరి పట్టించడం ద్వారా ముక్కు దిబ్బెడ నుంచిఉపశమనం పొందొచ్చు. ఇవి మూసుకుపోయిన ముక్కు మార్గాలను తెరవడానికి ఉపశమనం కలిగించడంలో సహాయ పడుతుంది. 

2.అల్లం టీ 

అల్లం టీ తాగడం ద్వారా ఇన్ ఫ్లమేషన్ తగ్గించి ముక్కు దిబ్బెడను తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయ పడుతుంది. అల్లంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ వైరల్ లక్షాణాలు ఉంటాయి. ఇవి సైనస్ లను క్లియర్ చేయడంలో సాయం చేస్తాయి. 

3.పసుపు పాలు

గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపు వేసి తాగడం వల్ల ముక్కు దిబ్బెడనుంచి ఉపశమనం పొందొచ్చు. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది శ్లేష్మ నిరోధక లక్షాణాలతో కూడిన సమ్మేళనం. ఇది ఎర్రబారిని ముక్కు భాగాలనుఉపశమనం కలిగిస్తుంది. 

4. తులసి టీ 

తులసి టీ రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా శ్వాసకోశ ఆరోగ్య ప్రయోజనాలకు ఇది ప్రసిద్ధి. ముక్కులోని సైనస్ వాపును తగ్గించి ముక్కు దిబ్బెడనుంచి ఉపశమనం,మొత్తం ఆరోగ్యాన్ని మెరుగు పర్చేందుకు తోడ్పడుతుంది. 

5. యాకలిప్టస్ ఆయిల్

వేడి నీళ్లలో కొన్ని చుక్కల యాకలిప్టస్ నూనె వేసి ఆవిరి పీల్చడం వల్ల ముక్కు దిబ్బడనుంచి తక్షణ ఉపశమనం పొందొచ్చు. యాకలిప్టస్ ఆయిల్ శ్వాస నాళాలను తెరిపించే డికాంగెస్టెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. 

6. ఆయుర్వేద ఆహారం

వెచ్చని , తేలికగా జీర్ణమయ్యే ఆహారం, జీలకర్ర, కొత్తమీర, మెంతులు వంటి మసాలా దినుసులను చేర్చడం  వల్ల జీవ క్రియ మొత్తం ఆరోగ్యాన్ని పెంచుతుంది. విషాన్ని తొలగించి, ముక్కు దిబ్బెడనుంచి ఉపశమనం, ఆరోగ్య కరమైన జీర్ణ వ్యవస్థను అందిస్తుంది.