
న్యూఢిల్లీ: వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో పర్యటించే ఇండియా అండర్–19 జట్టును గురువారం ప్రకటించారు. ముంబై బ్యాటర్ ఆయుష్ మాత్రే సారథ్యంలో 16 మందితో కూడిన టీమ్‌లో రాజస్తాన్ రాయల్స్ సెన్సేషనల్ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి చాన్స్ దక్కింది. జూన్ 24న 50 ఓవర్ల వామప్ మ్యాచ్‌తో మొదలయ్యే ఈ సిరీస్‌లో ఐదు యూత్ వన్డేలు జరగనున్నాయి.
తర్వాత ఇంగ్లండ్ అండర్–19తో రెండు మల్టీ డే మ్యాచ్‌లు ఆడనున్నారు. బిహార్ తరఫున వైభవ్ ఐదు ఫస్ట్ క్లాస్, ఆరు లిస్ట్–ఎ మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్ తరఫున 35 బాల్స్‌లోనే సెంచరీ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. గతేడాది ఆస్ట్రేలియా–ఎతో జరిగిన మ్యాచ్‌లోనూ సెంచరీ సాధించాడు. 17 ఏళ్ల ఆయుష్ 9 ఫస్ట్ క్లాస్, 7 లిస్ట్–ఎ మ్యాచ్‌ల్లో 962 రన్స్ చేశాడు.
అండర్–19 జట్టు: ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్- కెప్టెన్), హర్వాన్ష్ సింగ్. ఆర్‌ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహా, ప్రణవ్ రాఘవేంద్ర, మహ్మద్ ఇనామ్, ఆదిత్య రాణా, అన్మోల్‌జీత్ సింగ్.
స్టాండ్‌బై ప్లేయర్స్: నమన్ పుష్పక్, డి. దీపేష్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారీ, అలంకృత్ రాపోల్.