షాద్​నగర్​లో అక్టోబర్ 26 నుంచి ఆయుత చండీ అతిరుద్ర మహాయాగం

షాద్​నగర్​లో అక్టోబర్ 26 నుంచి ఆయుత చండీ అతిరుద్ర మహాయాగం
  • 14 రోజుల పాటు హోమాలు
  • వివరాలు వెల్లడించిన శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద

షాద్ నగర్, వెలుగు: విశ్వశాంతి కోసం నేటి నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు షాద్ నగర్ పట్టణంలో ఆయుత చండీ అతిరుద్ర మహాయాగాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామిజీ తెలిపారు. బుధవారం షాద్​నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇప్పటివరకు 80 మహా యాగాలను నిర్వహించామన్నారు. 81వ మహాయాగాన్ని నేటి నుంచి షాద్ నగర్ పట్టణంలోని జడ్చర్ల రోడ్​లో టౌన్ షిప్ ఎదురుగా ఉన్న వ్యవసాయ భూమిలో నిర్వహిస్తున్నామన్నారు. 650 మంది రుత్వికులు 14 రోజుల పాటు యాగాలు, హోమాలు చేస్తారన్నారు.