కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన అయ్యప్ప భక్తుడు మర్రి శివ సైకిల్పై మంగళవారం శబరిమలకు బయలుదేరారు. స్థానిక హరిహర అయ్యప్ప ఆలయంలో గురుస్వామి సమక్షంలో ముందుగా పూజలు చేసి, గురుస్వాముల ఆశీర్వాచనాల మధ్య సైకిల్యాత్రను ప్రారంభించారు.
సుమారు 1600 కిలోమీటర్ల దూరంలోని శబరిమలను 15 రోజుల్లో చేరుకుంటారని అయ్యప్ప భక్తులు తెలిపారు. శివకు మందమర్రి టౌన్ ఎస్సై రాజశేఖర్ పండ్లు,ఇతర సామగ్రిని అందజేశారు. శివ గతంలో ఆరు సార్లు మహాపాదయాత్రగా, సైకిల్పై వివిధ జ్యోతిర్లింగాలను సందర్శించారు.
