త్వరలో ఆజాద్ ఐపీఓ!

త్వరలో ఆజాద్ ఐపీఓ!

న్యూఢిల్లీ: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ కంపెనీ ఆజాద్ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ ఐపీఓ ద్వారా రూ.750 కోట్లు సేకరించేందుకు  సెబీ అనుమతులు పొందింది.   ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఐపీఓ ప్రిలిమినరీ పేపర్లు ఫైల్ చేయగా, డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5 న అబ్జర్వేషన్ లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుకుంది. సెబీ నుంచి  అబ్జర్వేషన్ లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తే ఐపీఓకి వచ్చేందుకు అనుమతులు దొరికినట్టే.

ఈ ఐపీఓలో  ఫ్రెష్ షేర్ల ఇష్యూ ద్వారా రూ.250 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.500 కోట్లు సేకరించాలని ఆజాద్ ఇంజినీరింగ్ చూస్తోంది. ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫర్ సేల్‌‌‌‌‌‌‌‌ కింద  ప్రమోటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాకేష్‌‌‌‌‌‌‌‌ చోప్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.170 కోట్ల విలువైన షేర్లను అమ్మనున్నారు. మరో రూ. 280 కోట్ల విలువైన షేర్లను  పిరమల్‌‌‌‌‌‌‌‌ స్ట్రక్చర్డ్‌‌‌‌‌‌‌‌ క్రెడిట్ ఆపర్చునిటీస్‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌ అమ్మనుంది. డీఎంఐ ఫైనాన్స్ మరో రూ.50 కోట్లు సేకరించనుంది. కాగా, గ్లోబల్‌‌‌‌‌‌‌‌ ఒరిజినల్ ఎక్విప్‌‌‌‌‌‌‌‌మెంట్ మాన్యుఫాక్చరర్లకు ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను ఈ కంపెనీ సప్లయ్ చేస్తోంది.