ఆజాం క్షమాపణ.. ఒప్పుకోని రమాదేవి

ఆజాం క్షమాపణ.. ఒప్పుకోని రమాదేవి

సమాజ్ వాది ఎంపీ ఆజాంఖాన్ లోకసభలో డిఫ్యూటీ స్పీకర్ రమాదేవీపై  చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని లేపాయో అందరికీ తెలిసిందే. ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా.. ’మిమ్మల్ని అలా చూస్తుండిపోవాలనిపిస్తుంది‘ అని రమాదేవీపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే  ఈ వ్యాఖ్యలకు గానూ ఆజాం ఖాన్ క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ ఊపందుకుంది. అయితే తానేమీ తప్పుగా అనలేదని, తన గురించి ఈ హౌస్ లో ఉన్నవారందిరికి తెలుసుననీ.. అయినా తాను తప్పుగా మాట్లాడానని భావిస్తే క్షమాపణలు చెప్పేందుకు సిద్దమేనని ఆజాంఖాన్ తెలిపారు.

రమాదేవి మాత్రం ఆజాం ఖాన్ చెప్పిన క్షమాపణలను స్వీకరించలేదు. ’ఆయన ప్రవర్తన జాతిని, మహిళా లోకాన్ని కించపరిచినై. ఆయనెప్పుడూ అలాగే ప్రవర్తిస్తరు ఇంకా మారలేదు. ఆయన ఇలాంటి అలవాట్లను మానుకోవాలె. నొటికెంతొస్తే అంత మాట్లాడతరు. ఈ పద్దతి మార్చుకోవాలె‘ అంటూ దుయ్యబట్టారు.

అయితే సోమవారం సభ ప్రారంభమయ్యాక ఆజాం ఖాన్ మరోసారి క్షమాపణ చెప్పవలసిందిగా.. స్పీకర్ ఓం బిర్లా కోరారు. అయితే స్పీకర్ ఆదేశాల మేరకు.. రమాదేవీ తనకు సోదరిలాంటిదని ఇదివరకే చెప్పిన అని, ఒక్కసారి చెప్పిన వెయ్యిసార్లు చెప్పిన అది మారదని.. ఆమెను మళ్లీ క్షమించమని అడుగుతున్నాని ఆజాంఖాన్ పేర్కొన్నారు.