అజీం ప్రేమ్‌‌‌‌జీ వర్సిటీల్లో కోర్సులు

అజీం ప్రేమ్‌‌‌‌జీ వర్సిటీల్లో కోర్సులు

అజీం ప్రేమ్‌‌‌‌జీ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్‌‌‌‌ బీఎస్సీ బీఎడ్, బీఏ, బీఎస్సీ, ఎంఏ, ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌ఎం కోర్సుల్లో అడ్మిషన్స్​కు నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. రాతపరీక్షలో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూల ఆధారంగా కోర్సుల్లోకి తీసుకుంటారు.

యూజీ:  బీఏ, బీఎస్సీ, బీఎస్సీ బీఎడ్​ కోర్సుల్లో అడ్మిషన్స్​ అందుబాటులో ఉన్నాయి. సంబంధిత గ్రూప్‌‌‌‌లో 50 శాతం మార్కులతో ఇంటర్‌‌‌‌ ఉత్తీర్ణత లేదా ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారై ఉండాలి. వయసు 21 ఏళ్లలోపు ఉండాలి.   

పీజీ: ఎంఏ, ఎల్​ఎల్​ఎం కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎకనామిక్స్‌‌‌‌ కోర్సుకు డిగ్రీలో ఆ సబ్జెక్టును చదివుండాలి. మిగిలిన వాటికి ఏ విభాగంలోనైనా డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సంస్థ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులూ అందిస్తోంది. వీటిలో ప్రవేశాలకూ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు  నవంబరు 24 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షను డిసెంబర్​ 24న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు  www.azimpremjiuniversity.edu.in వెబ్​సైట్​ సంప్రదించాలి.