వేరుశనగకు గిట్టుబాటు ధర కల్పిస్తాం : బి సింగారెడ్డి

వేరుశనగకు గిట్టుబాటు ధర కల్పిస్తాం : బి సింగారెడ్డి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర అందించేందుకు కృషి చేస్తామని వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్  బి సింగారెడ్డి తెలిపారు. బుధవారం నాగర్ కర్నూల్  మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు, వ్యాపారులు, కమీషన్  ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేరుశనగ క్రయ విక్రయాలు, ధరలపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం మార్కెట్​లో క్వింటాల్​కు రూ.7 వేలు ఉందని, అంతకన్నా తక్కువ ధర చెల్లిస్తే మార్కెట్​ అధికారులు వ్యాపారితో చర్చించి రైతుకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మట్టి, తాలు లేకుండా, పల్లిని ఎండబెట్టి మార్కెట్​కు తీసుకురావాలని రైతులకు సూచించారు. డిప్యూటీ డైరెక్టర్​ పద్మ హర్ష, జిల్లా మార్కెటింగ్  ఆఫీసర్​ బాలామణి, రమేశ్  పాల్గొన్నారు.

జడ్చర్ల టౌన్: రైతులు మార్కెట్​కు తెస్తున్న పంట దిగుబడులకు ఇస్తున్న రేట్లను మార్కెటింగ్​ జాయింట్​ డైరెక్టర్​ శ్రీనివాసులు పరిశీలించారు. బుధవారం జడ్చర్ల వ్యవసాయ మార్కెట్​ను సందర్శించిన ఆయన యార్డులోని షెడ్లలో వేరుశనగను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. సరైన ధర ఇవ్వడం లేదని పలు మార్కెట్లలో​రైతులు ఆందోళన చేయడంతో, మార్కెట్​ను పరిశీలించి రైతులకు ఇస్తున్న ధరలపై ఉన్నతాధికారలకు రిపోర్ట్  ఇవ్వనున్నట్లు సమాచారం.