
- నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక
హైదరాబాద్, వెలుగు : గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ (జీటీఏ) రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా బి.విద్యాసాగర్ ఎన్నికయ్యారు. ఆదివారం యూసుఫ్ గూడలో జీటీఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం కొత్త రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా డి.వాసుదేవరావు, ట్రెజరర్ గా ఎస్.శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్గా జయకర్, జాయింట్ సెక్రటరీగా ఇ.రామకృష్ణారెడ్డి, మహిళా కార్యదర్శిగా వి. మేరీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని నేతలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఈఓ, డిప్యూటీ ఐఓఎస్, ఎంఈఓ, గ్రేడ్ 1 హెడ్మాస్టర్ తదితర పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.