
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్లు బాబర్ ఆజం, వన్డే కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఏ కేటగిరి నుంచి బి కేటగిరికి పడిపోయారు. మంగళవారం (ఆగస్టు 19) 30 మంది సభ్యుల జాబితాతో కూడిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ లో ఒక్కరు కూడా ఏ కేటగిరిలో లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొన్నేళ్లుగా పాకిస్థాన్ క్రికెట్ లో స్టార్ క్రికెటర్లుగా ఏ కేటగిరీలో కొనసాగుతూ వస్తున్న బాబర్, రిజ్వాన్ కు డిమోషన్ రావడంతో వీరిద్దరూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు సమచారం. బాబర్, రిజ్వాన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. కాంట్రాక్టుల నుండి వైదొలగాలని వీరు నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మూడు ఫార్మాట్ లలో రెగ్యులర్ ప్లేయర్ కాకపోవడంతో ఈ స్టార్ క్రికెటర్లను బి కేటగిరిలో చేర్చినట్టు తెలుస్తోంది. ఇటీవలే ఈ జోడీ ఆసియా కప్ లో కూడా స్థానం దక్కించుకోలేకపోయారు. ప్రస్తుతం బాబర్, రిజ్వాన్ ఇద్దరూ కూడా టెస్ట్, వన్డే ఫార్మాట్ లో కొనసాగుతున్నారు. రిజ్వాన్ వన్డే కెప్టెన్ గా జట్టును నడిపిస్తున్నాడు. వీరిద్దరి ఫామ్ చూసుకుంటే పెద్దగా రాణించింది ఏమీ లేదు. రిజ్వాన్ కాస్త పర్వాలేదనిపించినా బాబర్ ఘోరంగా విఫలమయ్యాడు. రెండేళ్లుగా బాబర్ అంతర్జాతీయ క్రికెట్ లో సెంచరీ చేయలేదు. ఫార్మాట్ ఏదైనా పేలవ ఫామ్ తో జట్టుకు భారంగా మారాడు.
2025-26 పాకిస్తాన్ మెన్స్ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్:
కేటగిరీ బి (10 ప్లేయర్లు): అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫఖర్ జమాన్ , హరీస్ రవూఫ్, హసన్ అలీ, మహ్మద్ రిజ్వాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, షాదాబ్ ఖాన్ మరియు షాహీన్ షా ఆఫ్రిది
►ALSO READ | UPT20: ఆసియా కప్‌కు ముందు బిగ్ రిలీఫ్.. 48 బంతుల్లోనే 108 రన్స్‌తో దుమ్ములేపిన రింకూ
కేటగిరీ సి (10 ఆటగాళ్లు): అబ్దుల్లా షఫీక్, ఫహీమ్ అష్రఫ్, హసన్ నవాజ్, మహ్మద్ హరీస్, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, నోమన్ అలీ, సాహిబ్జాదా ఫర్హాన్, సాజిద్ ఖాన్ మరియు సౌద్ షకీల్
కేటగిరీ డి (10 మంది ఆటగాళ్లు): అహ్మద్ డానియాల్, హుస్సేన్ తలత్, ఖుర్రం షాజాద్, ఖుష్దిల్ షా, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, సల్మాన్ మీర్జా, షాన్ మసూద్ మరియు సుఫ్యాన్ మొకిమ్