ఓరి ఆజామూ ఆ కలరేంటి..!  బాబర్ ఆజామ్ లంబోర్గిని అవెంటడోర్.. ధర రూ. 26 కోట్లు

ఓరి ఆజామూ ఆ కలరేంటి..!  బాబర్ ఆజామ్ లంబోర్గిని అవెంటడోర్.. ధర రూ. 26 కోట్లు

బీసీసీఐ, ఐపీఎల్, ఎండార్స్‌మెంట్ల ద్వారా కోట్లకు కోట్లు ఆదాయాన్ని ఆర్జిస్తున్న భారత క్రికెటర్లే గొప్పని మనం అనుకుంటాం. విలాసవంతమైన భవనాలు, లక్సరీ కార్లు, చార్టెడ్ ఫైట్లు అబ్బో వీరికేంలే అని నాలుక కరుచుకుంటాం.. ప్రపంచ క్రికెటర్లతో పోలిస్తే మనవాళ్లకే డబ్బులెక్కువ అనే చర్చలు సాగిస్తాం.. నిజానికి అవన్నీ వాస్తవాలే అయినా విలాసవంతమైన జీవితాన్ని గడపడంలో పాక్ క్రికెటర్లు మనవారికంటే ముందున్నారు. సంపాదించేది అరకొరే అయినా అవన్నీ పోసి లక్సరీ జీవితాన్ని గడుపుతున్నారు.

పాకిస్తాన్ మాజీ సారథి ఇటాలియన్‌ కార్‌ బ్రాండ్ లంబోర్ఘిని అవెంటడోర్‌ను సొంతం చేసుకున్నాడు. కారు పర్పుల్ కలర్‌‌లో ధగధగ మెరిసిపోతోంది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కారు ధర భారత కరెన్సీలో రూ. 7.8 కోట్లు కాగా, పాకిస్తాన్ కరెన్సీలో 26 కోట్లుగా ఉండటం గమనార్హం.

పర్పుల్ కలర్‌

భారత కరెన్సీలో రూ. 7.8 కోట్ల విలువైన  విలాసవంతమైన కారు కొన్నందుకు బాబర్‌ను అందరూ అభినందిస్తున్నా.. కలర్ ఎంపికపై మాత్రం నెట్టింట జోకులు పేలుతున్నాయి. డీసెంట్ కలర్ కొనక.. చిన్న పిల్లాడిలా పర్పుల్ కలర్‌ ఏంటిరా ఆజామూ అంటూ నెటిజెన్స్ అతన్ని ఆటాడుకుంటున్నారు. మరికొందరైతే, 2004లో వచ్చిన అజయ్ దేవగన్ మూవీ 'టార్జాన్: ది వండర్ కార్'లో ఉపయోగించిన కారు ఇదే అని హేళన చేస్తున్నారు.