
పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు మహిళలను మోసం చేస్తున్నారని వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కడప జిల్లా పులివెందులలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడుతూ… సొంత మామనే కుట్ర చేసి చంపిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఆయన హయాంలోనే కడప స్టీల్ ప్లాంట్ కోసం ఎదురుచూపులే మిగిలాయన్నారు. ఉద్యోగాల్లేక విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారన్నారన్నారు. పులివెందులకు వచ్చి చంద్రబాబు మోసపూరిత మాటలు మాట్లాడారన్నారని ఆరోపించారు. పులివెందుల గడ్డపై పుట్టినందుకు తాను గర్వ పడుతున్నానన్నారు వైఎస్ జగన్.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే జేఎన్టీయూ, ట్రిపుల్ ఐటీ వచ్చాయన్నారు జగన్. అంతేకాదు అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం వచ్చింది కూడా వైఎస్ హయాంలోనే వచ్చిందన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై మాట్లాడిన వైఎస్ జగన్ …చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని చంపించింది టీడీపీ వాళ్లే.. మళ్లీ విచారణ చేయించేదీ వీళ్లేనని ఆరోపించారు. తప్పుడు విచారణలు చేయించి వీళ్లకు కావాల్సినట్టుగా రాయిస్తారన్నారు. ఏ కేసులైనా వీరికి అనుకూలంగా మార్చుకుంటారన్నారు. కడప జిల్లాలో టీడీపీ గెలవలేదని… అందుకోసమే జిల్లాలో కుట్రలకు పాల్పడ్డారన్నారు. జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలోనూ టీడీపీ ఓడిపోయే పరిస్థితి ఉందన్నారు జగన్.