
విజయనగరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యకర్తలను ఆకట్టుకున్నారు. పెంటమ్మ అనే వృద్ధురాలు… చంద్రబాబు ప్రసంగం పూర్తయ్యాక వేదికపైకి వచ్చి ప్రత్యేకంగా మాట్లాడారు. దొంగలకు ఓట్లు వేయొద్దని.. చంద్రబాబు ఎప్పటికీ మనమధ్యే ఉండాలని… ఆయనతోనే రాష్ట్ర అభివృద్ధి సాగుతుందని ప్రజలను కోరింది. పక్కనే ఉన్న చంద్రబాబు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
పెంటమ్మ చూపిన కసిని.. ప్రతి ఓటర్ చూపించాలని ప్రజలను కోరారు చంద్రబాబు. ఆ తల్లి అందరికీ స్ఫూర్తి అని చెప్పారు. ప్రభుత్వ పథకాలతో లబ్దిపొందిన ఆమె.. డబ్బులకోసం సభకు రాలేదన్నారు. ఆమెకు అందిన సేవలను చూసి తన గురించి గొప్పగా చెప్పిందన్నారు. ఆమెకు రుణపడి ఉంటానంటూ వేదికపైనే పెంటమ్మ పాదాలకు మొక్కారు చంద్రబాబు.
చంద్రబాబు పాదాభివందనం చేసినప్పుడు టీడీపీ కార్యకర్తలు జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.