ఈ పాప హగ్‌‌తో ఫేమస్‌‌

ఈ పాప హగ్‌‌తో ఫేమస్‌‌

ఎవరన్నా సాయం చేస్తే.. ‘థాంక్యూ’ అని చెప్తారు ఎవరైనా. అలాగే మనసుకు నచ్చిన పని చేసినప్పుడు మాటల్లో చెప్పలేని కొన్ని భావాలు ఉంటాయి. వాటిని ఒక్కమాటలో చెప్పలేనప్పుడు రకరకాలుగా ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ చేస్తుంటారు. అలాంటిదే ఈ స్టోరీ..

పై ఫొటోలో కనిపిస్తున్న పాపకు డిస్నీ కార్టూన్ క్యారెక్టర్స్‌‌‌‌ అంటే చాలా ఇష్టం. పొద్దున నిద్రలేచినప్పటి నుంచి మొదలుపెడితే పాలు తాగాలన్నా, అన్నం తినాలన్నా టీవీలో అయినా, ఫోన్‌‌‌‌లో అయినా డిస్నీ కార్టూన్స్‌‌‌‌ పెట్టాల్సిందే. రాత్రి పడుకునే ముందు కూడా అవి చూడంది పడుకోదు. ఆ పాపకు అవంటే అంత ఇష్టం. కాబట్టే... వద్దని ఆపేస్తే ఏడ్చి గోల చేస్తుంది.

వాళ్ల ఊళ్లో జరుగుతున్న ‘డిస్నీ ఆన్‌‌‌‌ ఐస్‌‌‌‌ షో’ ఎగ్జిబిషన్‌‌‌‌కు ఒక రోజు తీసుకెళ్లాడు వాళ్ల తాత. రోజూ చూస్తున్న తన ఫేవరెట్ డిస్నీ క్యారెక్టర్స్ అన్నీ అలా ఒక్కసారిగా కళ్లముందుకు వచ్చేసరికి చాలా ఆనందపడింది. ఆ సంతోషమంతా తన కళ్లల్లో కనిపించింది. తాత ఒళ్లో కూర్చున్న పాప ఒక్కసారిగా ఎగిరి గంతేసి, తాతని గట్టిగా హగ్‌‌‌‌ చేసుకుంది. దానికి అర్థం ‘థాంక్యూ’ అని. ఈ వీడియోను పాప వాళ్ల అమ్మ మరీయా గలాటి హిల్‌‌‌‌ తన ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌ అకౌంట్‌‌‌‌లో పోస్ట్‌‌‌‌ చేసింది. ఈ వీడియో సోషల్‌‌‌‌ మీడియాలో వైరల్ అయింది. ఇది రాసేటప్పటికి 30,000 వ్యూస్‌‌‌‌, 15,000 లైక్స్‌‌‌‌ దాటేసింది.