
యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సీరీస్ లో నటించి ప్రేక్షకులను దగ్గరైన వైష్ణవి చైతన్య(Vishanvai Chaitanya).. సాయి రాజేష్(Sai Rajesh) దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ(Baby) సినిమాతో సూపర్ హిట్ కొట్టేసింది. సినిమాలో వైష్ణవి తన పాత్రకు 100 పర్సెంట్ న్యాయం చేసింది. మొదటి సినిమాలోనే చాలా డెప్త్ ఉన్న పాత్రలో తన నటనతో మెప్పించింది వైష్ణవి. ఈ క్రమంలో ఆ హిట్ క్రేజ్ తోనే వరుస అవకాశాలు అందుకుంటుంది. ఇదే క్రమంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju) కూడా వైష్ణవితో సినిమా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
నూతన దర్శకుడు అరుణ్ భిమవరపు డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది. సినిమాలో దిల్ రాజు ఇంటి హీరో ఆశిష్ నటిస్తుండగా ఫీమేల్ లీడ్ గా వైష్ణవిని సెలెక్ట్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో బేబీ వైష్ణవి కి ఈ సినిమా కోసం దాదాపు 1 కోటి దాకా రెమ్యునరేషన్ ఆఫర్ ఇచ్చారని తెలుస్తుంది. తెలుగు అమ్మాయి హీరోయిన్ గా రాణించడం గ్రేట్.. తోటి స్టార్ హీరోయిన్స్ లాగా కోట్ల కొద్దీ రెమ్యునరేషన్ తీసుకోవడం కూడా గొప్ప విషయమే. రెమ్యూనరేషన్ విషయంలో వైష్ణవి మళయాళ, ముంబై హీరోయిన్స్ కి దీటుగా వస్తుంది. బేబీ క్రేజ్ తోనే వైష్ణవికి నాలుగైదు సినిమాల దాకా ఆఫర్లు వచ్చాయని తెలుస్తుంది. కెరీర్ లో మొదటి హిట్ తర్వాత అవకాశాలు రావడం కామనే కానీ ఆ చాన్సులతో కెరీర్ ని నిలబెట్టుకోవాలి. అందుకే ఆచి తూచి అడుగులేస్తున్నట్టు సమాచారం. ఆశిష్ తో పాటుగా ఆనంద్ దేవరకొండ తో కూడా మరో సినిమా చేస్తుంది వైష్ణవి.