ఐటెం సాంగ్ చేయనున్న బేబీ వైష్ణవి

ఐటెం సాంగ్ చేయనున్న బేబీ వైష్ణవి

వైష్ణవి చైతన్య.. తెలుగమ్మాయి అయిన ఈ బ్యూటీ బేబీ సినిమాతో ఒక్కసారిగా స్టార్ యాక్టర్ గా మారిపోయింది. దీంతో ఈ అమ్మడికి టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. అయితే వైష్ణవికి చెప్పుకోదగ్గ ఆఫర్లు అయితే రాలేదు. తరువాత తన మొదటి సినిమా హీరో అయిన ఆనంద్ దేవరకొండకి జోడీగా మరో సినిమాకి ఒకే చెప్పింది.

కొన్ని పెద్దసి నిమాల్లో ఆఫర్ కొట్టేసింది అనే టాక్ వచ్చినప్పటికీ.. అవి ఎంత మాత్రం నిజమనే దానిపై క్లారిటీ లేదు. పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా వైష్ణవిని ఎంపిక చేశారని ప్రచారం జరిగింది. అయితే ఇందులో వాస్తవం లేదని తరువాత తెలిసింది. అయితే ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్. సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి వైష్ణవి ఒకే చెప్పిందనే మాట వినిపిస్తోంది. ముందుగా ఆమె ఒప్పుకోకపోయిన బేబీ దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడి ఆమెని ఒప్పించాడట పూరి జగన్నాథ్.

ఇప్పుడు ఇదే టాలీవుడ్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. ఒక్క సినిమాలో హీరోయిన్ గా చేసిన బ్యూటీ వెంటనే ఐటెం సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా అనే ప్రశ్న సోషల్ మీడియాలో వినిపిస్తోంది.