రోహిత్ శర్మ సిక్సర్..చిన్నారికి గాయం

రోహిత్ శర్మ సిక్సర్..చిన్నారికి గాయం

ఇంగ్లాండ్తో జరిగిన ఫస్ట్ వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. సూపర్ హాఫ్ సెంచరీతో టీమిండియాకు విజయాన్నందించాడు. మొత్తం 58 బంతుల్లో 76 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో రోహిత్ 5 సిక్సర్లు బాదాడు. అయితే రోహిత్ కొట్టిన ఓ సిక్సర్ స్టేడియంలో కూర్చున్న ఓ చిన్నారిని గాయపర్చింది. 

ఇంగ్లాండ్ను 110 పరుగులకే ఆలౌట్ చేసిన 111 టార్గెట్ను సాఫీగా ఛేదించింది. అయితే భారత ఇన్నింగ్స్ ఐదో ఓవర్లలో డేవిడ్ విల్లీ వేసిన ఓ బాల్ను రోహిత్ శర్మ పుల్ షాట్ తో సిక్సర్గా మలిచాడు.  అయితే స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ఓ పాపకు బలంగా తాకింది. ఆ పాప నొప్పిని తట్టుకోలేక విలవిల్లాడింది. 

రోహిత్ కొట్టిన సిక్సర్ వల్ల పాపకు గాయమైందని  బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ క్రికెటర్లకు చెప్పాడు. రోహిత్ దగ్గరికి వచ్చిన బెయిర్ స్టో.. చిన్నారికి గాయమైన  విషయాన్ని  తెలియజేశాడు. దీంతో ఆ పాప పట్ల రోహిత్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ  క్రమంలో కొద్దిసేపు మ్యచ్ ఆగిపోయింది. అనంతరం ఇంగ్లాండ్ ఫిజియోలు చిన్నారి దగ్గరకు వెళ్లి  ప్రథమ చికిత్స చేశారు.  అయితే ట్విటర్ లో పాపతో దిగిన ఫోటోను ఓ అభిమాని పోస్ట్ చేశాడు. ఆ చిన్నారి పేరు  మీరా సాల్వి అని తెలిపాడు. ప్రస్తుతం ఆమె బాగానే ఉందని ఫోటో పోస్ట్ చేసి కామెంట్ చేశాడు.

 

మరిన్ని వార్తలు