ఉప్పల్ లో పసికందు మృతదేహం

ఉప్పల్ లో పసికందు మృతదేహం

ఉప్పల్ భరత్ నగర్ లోని శ్మశానవాటికలో ముక్కుపచ్చలారని పసికందు మృతదేహం పడి ఉండటం స్థా నికంగా కలకలం రేపింది. మల్కాజిగిరి ఏసీపీ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉప్పల్ లోని భరత్ నగర్ శ్మశానవాటికలో 3 రోజుల ఆడ శిశువును స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందిం చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పసికందు మృతదేహాన్ని పోస్టు మార్టమ్ కోసం గాంధీ హాస్పిటల్ కి తరలిం చారు. అయితే శిశువు మెడకు చీర చుట్టి ఉండటంతో పాటు అమావాస్య కావడంతో ఎవరైనా పసికందును చంపేసి అక్కడ పడేశారా లేదా పుట్టగానే శ్మశాన వాటికలో పడేసి వెళ్లారా అనేది విచారణలో తేలుతుందని మల్కాజిగిరి ఏసీపీ సందీప్ తెలిపారు. శిశువు పుట్టి 3 రోజులై ఉండొచ్చని..ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నట్టు ఆయన చెప్పా రు.