ఉప్పల్, వెలుగు: ఉప్పల్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. 2009 బ్యాచ్‌కు చెందిన శ్రీకాంత్ (42) ఉప్పల్ మల్లికార్జున్ నగర్లో నివాసం ఉంటూ ఫిల్మ్ నగర్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా డ్యూటీకి వెళ్లడం లేదు. ఇంతలోనే శనివారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు.
శ్రీకాంత్ ఆర్థిక సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నాడని, ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులకు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
