- అవినీతి, కుటుంబ పాలనతో విసిగిపోయారు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల అవినీతి, కుటుంబ పాలనతో విసిగిపోయిన ప్రజలు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. జూబ్లీహిల్స్‌లో ముస్లింల ఓట్ల కోసం సీఎం రేవంత్‌రెడ్డి నుంచి మొదలు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వరకు స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
శనివారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్.. జాతీయ పార్టీయా? లేదా కేవలం ముస్లింల కోసం మాత్రమేనా? అని ప్రశ్నించారు. 20 శాతం ఓట్ల కోసం 80 శాతం మంది ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఫైర్అయ్యారు.
రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారే..
భవిష్యత్తులో తెలంగాణలో తప్పకుండా డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడుతుందని లక్ష్మణ్ఆశాభావం వ్యక్తం చేశారు. పదేండ్ల యూపీఏ హయాంలో తెలంగాణకు అందిన నిధుల కన్నా.. ఎన్డీయే హయాంలో ఎక్కువగా వచ్చాయని చెప్పారు.
