గ్రేటర్ హైదరాబాద్ లో ఘనంగా సీఎం బర్త్డే వేడుకలు

గ్రేటర్ హైదరాబాద్ లో ఘనంగా సీఎం బర్త్డే వేడుకలు

పద్మారావునగర్/ తార్నాక/ వికారాబాద్, వెలుగు: గ్రేటర్​హైదరాబాద్​లో​ సీఎం రేవంత్​రెడ్డి బర్త్​డే వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. సనత్​నగర్ నియోజకవర్గంలోని శ్యామలకుంటలో కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఆధ్వర్యంలో అంగన్వాడీ సెంటర్​లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి అజారుద్దీన్, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం అమీర్​పేటలో కూడా కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో సీఎం రేవంత్ కీలకపాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. 

రేవంత్​రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి సాధిస్తోందన్నారు. తార్నాకలోని తన క్యాంపు ఆఫీస్​లో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్​రెడ్డి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అలాగే వికారాబాద్​లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్​పంపిణీ చేశారు.