తల్లి మృతదేహం వద్దే  ఆకలితో రెండు రోజులున్న చిన్నారి

తల్లి మృతదేహం వద్దే  ఆకలితో రెండు రోజులున్న చిన్నారి

పుణె: చిన్న పిల్లగాడు. రెండు రోజులుగా ఏడుస్తునే ఉన్నడు. అమ్మ ఎందుకు లేస్తలేదో తెలుస్తలేదు. చుట్టుపక్కల మస్త్ మంది ఉన్నరు. కానీ కరోనా భయంతో ఎవరూ   ఇంట్లోకి రాలే.   అమ్మకు ఏమైందో తెల్వక.. మరోపక్క మంచినీళ్లు లేక అలమటించిన ఆ పసివాడిని చివరకు పోలీసులు  కాపాడారు. మహారాష్ట్ర పుణే సిటీ సమీపంలోని పింప్రి చించ్వాడ్ లో ఈ విషాదం చోటు చేసుకుంది. పింప్రి చించ్వాడ్ కు చెందిన ఓ వ్యక్తి పని కోసం యూపీకి వలస వెళ్లాడు. అతని భార్య, 18 నెలల కొడుకు ఇక్కడే ఉంటున్నరు. అయితే శనివారం ఏమైందో ఏమోగానీ ఆమె చనిపోయింది. ఆ పసివాడు కంటిన్యూగా ఏడుస్తూ ఉన్నా చుట్టుపక్కలవాళ్లు కరోనా భయంతో ఆ ఇంట్లోకి పోలేదు. సోమవారం డెడ్ బాడీ దుర్వాసన రావడంతో ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. వాళ్లు వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. తల్లి డెడ్ బాడీ పక్కన ఏడుస్తూ కూర్చున్న బాబును చూశారు. నీళ్లు, బిస్కెట్లు ఇచ్చారు. బాబుకు  కరోనా నెగెటివ్ అని తేలింది. చిన్నారి సేఫ్ అని చెప్పడంతో ప్రభుత్వ అనాధాశ్రమానికి తరలించారు. ఆ తల్లి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. ఆమె అటాప్సీ రిపోర్ట్ వస్తేనే.. ఎలా చనిపోయిందో తెలుస్తుందని పోలీసులు చెప్పారు. ఆ చిన్నారి తండ్రి ఇంకా తిరిగి రాలేదని, అతను వచ్చాక బాబును అప్పగిస్తామని తెలిపారు.