
అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా సుబ్బు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బచ్చలమల్లి’. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తు న్నారు. శుక్రవారం ఈ చిత్రం నుంచి సెకండ్ సాంగ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రిలీజ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన ఈ మెలోడీకి కృష్ణకాంత్ రాసిన లిరిక్స్, ఎస్పీ చరణ్, రమ్య బెహరా పాడిన విధానం ఆకట్టుకుంది.
‘నిలబడే నిద్ర పడుతుందని.. మత్తు ఒకటుందని తెలిసే.. తెలియదే అన్ని వ్యసనాలని మించే వ్యసనం పేరే ప్రేమని.. తన నీడ నన్నే తాకుతుంటే మనసు మరిగిన మురికి వదిలిన..అదే నేను అసలు నేను..తిరిగి జరిగిన జననమా.. ఎలా నిన్ను వీడిపోను..వెలుగు వెనకన నడవనా’ అంటూ సాగిన పాటలో అల్లరి నరేష్, అమృత అయ్యర్ మధ్య బాండింగ్‌ని అందంగా ప్రజెంట్ చేశారు.
నరేష్ రగ్గడ్ లుక్‌లో కనిపిస్తుంటే, అమృత ట్రెడిషినల్ గెటప్‌లో ఇంప్రెస్ చేస్తోంది.1990 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 20న సినిమా విడుదల కానుంది.