
మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో గత కొద్ది రోజులుగా ఎక్కువ మ్యారేజ్ లు జరుగుతున్నాయి. ముంపుకు గురయ్యే గ్రామాల్లో నిర్వాసితులకు పునరావాసం,ఉపాధి ప్యాకేజీ కింద పెళ్లి జరిగిన వారికి కలిసి వస్తుందని ఈ వివాహాలు జరుగుతున్నాయి. పెళ్లి కాని 18 ఏళ్లు దాటిన వారికి రూ.5 లక్షలతో పాటు 250 గజాల ఇంటి స్థలం. ఒక వేళ పెళ్లైతే రూ.7.5 లక్షలతో పాటు 250 గజాల ఇంటి స్థలం, డబుల్ బెడ్ రూం ఇంటిని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఇస్తోంది.