గ్యాస్​ పైప్​లైన్ లీకేజీ ... బీబీఆర్ ఐటీ కాలేజీపై కేసు నమోదు

గ్యాస్​ పైప్​లైన్ లీకేజీ ... బీబీఆర్ ఐటీ కాలేజీపై కేసు నమోదు

జీడిమెట్ల, వెలుగు: నిర్లక్ష్యంగా డ్రైనేజీ పనులు చేయిస్తూ.. గ్యాస్​పైప్​లైన్​ లీకేజీకి కారణమైన ఇంజనీరింగ్​ కాలేజీ మేనేజ్ మెంట్ పై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.  రాజీవ్​గాంధీనగర్ లో మంగళవారం రాత్రి బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్​కాలేజీ యాజమాన్యం డ్రైనేజీ పనులు చేయిస్తుంది. నిర్లక్ష్యంగా పనులు చేయగా..  భాగ్యలక్ష్మీ గ్యాస్​ పైప్​లైన్​ పగిలిపోయింది. 

దీంతో ఒక్కసారిగా గ్యాస్​ లీకేజీ అయి స్థానికులు భయాందోళన చెందారు. ట్రాఫిక్​జామ్ అయింది.  బాచుపల్లి సీఐ ఉపేందర్, ఎస్ఐ సంధ్య సిబ్బందితో వెళ్లి  ట్రాఫిక్​మళ్లించారు.  ఫైర్, గ్యాస్​ ఏజెన్సీకి సమాచారం ఇచ్చారు. దీంతో గ్యాస్​నిర్వాహకులు వచ్చి మరమ్మతులు చేపట్టారు. బీవీఆర్​ ఐటీ కాలేజీ మేనేజ్ మెంట్ పై  కేసు నమోదు చేసినట్టు సీఐ ఉపేందర్ తెలిపారు.