ఇండియాకు శివాజీ మహరాజ్ ఆయుధం

ఇండియాకు శివాజీ మహరాజ్ ఆయుధం

ముంబై: ఛత్రపతి శివాజీ మహరాజ్ ఉపయోగించిన 'వాఘ్ నఖ్' అనే ప్రత్యేక ఆయుధాన్ని త్వరలో లండన్​నుంచి మహారాష్ట్రకు తీసుకురానున్నారు. ఇందుకోసం మహారాష్ట్ర సర్కారు ప్రయత్నాలు చేస్తున్నది. వాఘ్ నఖ్ అనేది పులి గోర్ల ఆకారంలో ఉండే ఇనుప ఆయుధం.1659లో బీజాపూర్ సుల్తాన్​ అఫ్జల్ ఖాన్‌ను చంపడానికి ఛత్రపతి శివాజీ మహరాజ్ దీనిని ఉపయోగించారు. 

ఇది ​​ప్రస్తుతం  లండన్‌లోని విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంది.  నవంబర్‌లో దాన్ని మహారాష్ట్రకు తీసుకొచ్చే అవకాశం ఉందని ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ శుక్రవారం తెలిపారు. ఇందుకోసం ముంగంటివార్ ఈ నెలాఖరులో యూకే వెళ్లనున్నారు. శివాజీ మహరాజ్ అఫ్జల్ ఖాన్‌ను హతమార్చిన రోజైన నవంబర్​ 10న దానిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని మంత్రి తెలిపారు.