ఢిల్లీ, హర్యానాలో వరుస భూకంపాలు

ఢిల్లీ, హర్యానాలో వరుస భూకంపాలు

దేశ రాజధాని, హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో గురువారం (జూలై 25) వరుసగా రెండుసార్లు భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకటించిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 10గంటలకు రిక్టర్ స్కేల్‌పై 2.4 తీవ్రతతో భూమి కంపించింది.

ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురైయ్యారు. అదే ప్రాంతంలో మళ్లీ  గంట తర్వాత మరో భూకంపం వచ్చింది. ఢిల్లీ- ఎన్‌సిఆర్‌లోని పలు ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి.  ఈ విషయాన్ని  నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ అఫీషియల్ X అకౌంట్లో తెలిపింది.