మోదీపై పోటీ చేస్తే ప్రియాంకే గెలుస్తది: సంజయ్ రౌత్

మోదీపై పోటీ చేస్తే ప్రియాంకే గెలుస్తది: సంజయ్ రౌత్

ముంబై: శివసేన (థాక్రే వర్గం) నేత సంజయ్ రౌత్ కీలక కామెంట్లు చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వారణాసి నుంచి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారని అన్నారు. ‘‘వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తే ప్రియాంకా గాంధీకి విజయం ఖాయం. మోదీ నియోజకవర్గమైన వారణాసి ప్రజలు ప్రియాంకను కోరుకుంటున్నారు. అక్కడి ప్రజలకు ఆమె చాలా దగ్గరయ్యారు. రాయ్​బరేలి, వారణాసి, అమేథీలో బీజేపీ గెలవడం కష్టమే”అని సంజయ్ అన్నారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, తన సోదరుడి కొడుకు అజిత్ పవార్​ భేటీ గురించి సంజయ్ మాట్లాడుతూ.. ‘పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పీఎం నరేంద్ర మోదీ కలుసుకోగాలేనిది, వీళ్లిద్దరూ ఎందుకు కలుసుకోకూడదు’ అని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంతో మహారాష్ట్ర ప్రజలు సంతోషంగా లేరని ఆయన కామెంట్ చేశారు.