
హైదరాబాద్/షాద్‌నగర్ వెలుగు: రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజైన నేపథ్యంలో బల్దియా అధికారులు, పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో గ్రేటర్ సిటీతో పాటు శివారు ప్రాంతాల్లోని పొలిటికల్ లీడర్ల ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను బల్దియా సిబ్బంది తొలగించారు. మరోవైపు పోలీసులు అన్ని ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వెహికల్ చెకింగ్ చేపట్టారు.
గ్రేటర్ సిటీలోని పలు ఏరియాలతో పాటు వనస్థలిపురం, షాద్ నగర్లో మొదటిరోజు భారీగా డబ్బు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.