తగ్గనున్న బ్యాంకుల మొండిబాకీలు

తగ్గనున్న బ్యాంకుల మొండిబాకీలు

న్యూఢిల్లీ:  బ్యాంకుల మొండిబాకీలు  కొత్త ఆర్థిక సంవత్సరంలో తగ్గనున్నాయని కేర్ రేటింగ్స్‌‌‌‌ ఓ రిపోర్ట్‌‌‌‌లో పేర్కొంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని బ్యాంకుల గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్‌‌‌‌ (జీఎన్‌‌‌‌పీఏ) 2.1 శాతానికి దిగిరానున్నాయని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎన్‌‌‌‌పీఏలు 2.5 శాతం నుంచి 2.7 శాతానికి  తగ్గే అవకాశం ఉందని, కొత్త ఆర్థిక సంవత్సరంలో 2.1 శాతం నుంచి 2.4 శాతానికి  తగ్గొచ్చని అంచనా వేసింది. వడ్డీ రేట్లు పెరగడం, రెగ్యులేషన్స్‌‌‌‌లో మార్పుల కారణంగా అసెట్ క్వాలిటీ  పడిపోవచ్చని కూడా కేర్ రేటింగ్స్ రిపోర్ట్ పేర్కొంది.

అంతేకాకుండా గ్లోబల్‌‌‌‌ అంశాలు, సరిపడినంత లిక్విడిటీ లేకపోవడం వంటి కారణాలు కూడా బ్యాంకుల ఎన్‌‌‌‌పీఏలపై ప్రభావం చూపొచ్చని  తెలిపింది.  దేశంలోని బ్యాంకుల జీఎన్‌‌‌‌పీఏలు 2013–14 లో 3.8 శాతం ఉంటే 2017–18 నాటికి  11.2 శాతానికి పెరిగాయి. ఈ టైమ్‌‌‌‌లోనే కొన్ని ఇబ్బందుల్లో ఉన్న ఆస్తులను మొండిబాకీలుగా చూపాలని బ్యాంకులకు ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ సూచనలు ఇచ్చింది. ఆ తర్వాత నుంచి మొండిబాకీలు తగ్గుతూ వస్తున్నాయి. 2022–23 లో 3.9 శాతానికి పడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో జీఎన్‌‌‌‌పీఏలు 3 శాతంగా రికార్డయ్యాయి.