Bad Breath: ఇది మీకు తెలుసా.. కూరగాయలు, పండ్లతో కూడా నోటి దుర్వాసన పోగొట్టవచ్చు..

Bad Breath: ఇది మీకు తెలుసా.. కూరగాయలు, పండ్లతో కూడా నోటి దుర్వాసన పోగొట్టవచ్చు..

కొంత మంది రోజుకు రెండు సార్లు పళ్లు తోముకున్నా.. నోరు చెడు వాసన వస్తుంటుంది. అలాంటిప్పుడు నలుగురిలోకి వెళ్లి మాట్లాడాలంటే.. మన గురించి ఇతరులు ఏమనుకుంటారో అని భయపడుతారు. దీనివల్ల చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. ఎదుటివారితో సరిగా మాట్లాడలేరు. పదేపదే నోరు తెరిస్తే దుర్వాసన వస్తుందని భయపడిపోతుంటారు. 

అయితే ఈ సమస్యకు చెక్ పెట్టాలని చాలా మంది మార్కెట్ లో దొరికే మౌత్ ప్రెషనర్లను, వెరైటీ వెరైటీ టూత్ ఫేస్ట్ లను వాడుతుంటారు. కానీ ఇలాంటి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇంటి చిట్కాలను ఉపయోగిస్తే ఈ సమస్య నుంచి 
సింపుల్ గా బయటపడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

నోటి దుర్వాసన టిప్స్..

చూయింగ్ గమ్..

* చూయింగ్ గమ్ తినడం వల్ల నోట్లో లాలాజలం ఊరుతుంది. దంతాల మధ్య ఇరుక్కున్న ఆహారాన్ని ఇది తొలగిస్తుంది. దీంతో నోరు ఫ్రెష్ గా ఉంటుంది. 

కూరగాయలు, పండ్లు..

* కూరగాయలు, పండ్లు నోటి దుర్వాసనను తగ్గిస్తాయని మీకు తెలుసా.. యాపిల్, క్యారెట్ సహజ టూత్ బ్రష్ లాగా పని చేస్తాయి. బ్యాక్టీరియాతో పాటు ఇవి దుర్వాసనను కూడా తొలగిస్తాయి. దీంతో పాటు పళ్లను ఎప్పుడు తెల్లగా మారుస్తాయి.

టంగ్ క్లీనర్..

* నాలుక కూడా నోటి దుర్వాసనకు ఓ కారణమే.. బ్రష్ చేసుకున్న తర్వాత టంగ్ క్లీనర్ తో నాలుకను తప్పకుండా క్లీన్ చేసుకోవాలి.. ఇలా ప్రతిరోజు చేస్తే దుర్వాసనకు దూరం అవుతుంది. 

ఉప్పు..

* కొంచెం మెత్తటి ఉప్పును బ్రష్‌పై వేసుకుని దానితో పళ్లను తోమాలి. ఇలా చేయడం వల్ల నోటిలో ఉండే బ్యాక్టీరియా చనిపోయి దుర్వాసన పూర్తిగా పోతుంది. దీంతోపాటు పళ్లకు పట్టిన గార కూడా తోలగిపోతుంది. 

నిమ్మరసం..

* ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కప్పు నీటిలో కలిపి పుక్కిలించాలి. కావాలంటే ఇందులో చిటికెడు ఉప్పును కూడా కలుపుకోవచ్చు. ఇలా చేయడం వల్ల నోరు పొడిబారడం తగ్గుతుంది. 

కొత్తిమీర‌..

* కొత్తిమీర‌లో ఉండే క్లోరోఫిల్ యాంటీ బాక్టీరియల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది నోటి దుర్వాసన నివారించడానికి చాలా బాగా సహాయపడుతుంది. కొత్తి మీరను తీసుకుని నోట్లో వేసి నలమడం.. రసం తాగడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.

పెరుగు..

* పెరుగు తినడం, గ్రీన్ టీ తాగడం ద్వారా కూడా నోటి దుర్వాసనను పోగొట్టుకోవచ్చు. పెరుగులోని ప్రోబయోటిక్స్ నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను దూరం చేస్తాయి.

జీలకర్ర..

* భోజనం తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తినడం వల్ల కూడా నోటి దుర్వాసన పోతుంది. అలాగే జీలకర్ర టీ తాగినా దుర్వాసన దూరం అవుతుంది.

లవంగాలు..

* రెండు మూడు లవంగాలను నోట్లో వేసుకొని నమలండి.. దీనివల్ల దుర్వాసన పోయి ఎప్పుడు నోరు ప్రెష్‌గా ఉంటుంది. ఎందుకంటే లవంగంలో యాంటీ బ్యాక్టీరియా గుణాల వల్ల ఉపశమనం లభిస్తుంది.

గోరువెచ్చని నీళ్లు..

* ఉదయం పూట పళ్లు తోముకున్న తర్వాత.. గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు వేసి పుక్కిలించాలి. తర్వాత నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. 

మిరియాల పొడి..

* కొంచెం మిరియాల పొడి, పసుపు, ఉప్పు, నువ్వుల నూనె వీటన్నింటిని కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుతో పళ్లు తోమితే చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి. దీనివల్ల నోటి దుర్వాసన తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మెంతులు..

* ఒక కప్పు నీటిని వేడి చేసుకుని అందులో స్పూన్ మెంతులు వేసి రాత్రంతా ఉంచాలి.. మరుసటి రోజు ఉదయం బ్రష్ చేసిన తర్వాత ఈ నీరు తాగాలి.. ప్రతిరోజు ఇలా చేస్తే నోటి దుర్వాసన పోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.