ఎయిర్ ఇండియా విమానంలో బ్యాడ్ ఫుడ్, డర్టీ సీట్స్..ప్యాసింజర్ పోస్ట్ వైరల్ 

ఎయిర్ ఇండియా విమానంలో బ్యాడ్ ఫుడ్, డర్టీ సీట్స్..ప్యాసింజర్ పోస్ట్ వైరల్ 

ఇది చాలా దారుణమైన అనుభవం.. వేల కిలోమీటర్లు ప్రయాణం..లక్షలు వెచ్చించి టికెట్ కొనుక్కుని కాస్త ప్రశాంతంగా ప్రయాణిద్దామంటే..ఇదేం గోల..మురికిపట్టిన సీట్లు..కుళ్లిన ఫుడ్..సుదీర్ఘ ప్రయాణంలో ఎలా ప్రశాంతంగా ఉండేది..ఇదో హారర్ స్టోరీ.. అని ఓ ఎయిర్ ఇండియా ప్యాసింజర్..సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం X లో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ హల్ చల్ చేస్తోంది.వివరాల్లోకి వెళితే.. 

న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు ఓ ప్యాసింజర్ ఎయిర్ ఇండియా విమానంకోసం  టికెట్ బుక్ చేసుకున్నాడు. అతను తన ప్రయాణంలో ఎదురైన బ్యాడ్ ఎక్స్ పీరియెన్స్ గురించి చెబుతూ హారర్ స్టోరీ ట్యాగ్ లైన్ తో X లో ఓ పోస్ట్ ను షేర్ చేశాడు. ఇందులో బ్యాడ్ ఫుడ్, డర్టీ సీట్లు, దుప్పట్ల ఫొటోలను షేర్ చేశాడు. ఇవి ఎయిర్ ఇండియా విమానం అధ్వాన్న పరిస్థితిని చూపిస్తున్నాయని చెప్పుకొచ్చాడు. 

తర్వాత ఆ వ్యక్తి  ఎయిర్ ఇండియా నుంచి వచ్చిన రిప్లైకి సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేశాడు. ఎయిర్ లైన్స్ ఈ సమస్యలపై స్పందించినప్పటికీ తర్వాత దానిని తొలగించిందని.. మీరు పోస్ట్ ను ఎందుకు తొలగించారు అని స్క్రీన్ షాట్ పోస్ట్ చేస్తూ క్వశ్చన్ చేశారు. తనకు కేటాయించిన  విరిగిన డర్టీ సీటు, బ్యాడ్ ఫుడ్ కు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశాడు. 

ఈ పోస్ట్ ను చూసిన నెటిజన్లు ఎయిర్ ఇండియా సర్వీస్ పై విరుచుకుపడ్డారు..‘‘ఇకపై నేను ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ఎంచుకుంటాను.. దేశీయ విమానాలకు ఇదే చివరి ఎంపిక  అని ఓ నెటిజన్ రాశాడు. మరో నెటిజన్ స్పందిస్తూ..నిజం చెడ్డ అనుభవం..వారి చేతులో విస్తారా ఇలా మారడం నిజంగా దురదృష్టకరం అని రాశాడు. ఇటీవల కాలంలో ఎయిర్ ఇండియాపై చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. నేను ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నాను ’’ అని చెప్పుకొచ్చారు.