అమ్మాయిల స్వేచ్ఛపై బ్యాడ్ గాళ్స్ మూవీ..

అమ్మాయిల స్వేచ్ఛపై బ్యాడ్ గాళ్స్ మూవీ..

అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌‌లో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఫేమ్ మున్నా తెరకెక్కిస్తున్న చిత్రం ‘బ్యాడ్‌‌ గాళ్స్‌‌’. కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్‌‌లైన్. శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ టైటిల్‌‌ మోషన్ పోస్టర్‌‌ లాంచ్‌‌ బుధవారం ప్రసాద్‌‌ ల్యాబ్స్‌‌లో జరిగింది.  దర్శకులు చందూ మొండేటి, శివ నిర్వాణ, కృష్ణ చైతన్య అతిథులుగా పాల్గొని బెస్ట్‌‌ విషెస్‌‌ చెప్పారు. దర్శకుడు మున్నా మాట్లాడుతూ ‘అమ్మాయిలకు పెళ్లి ముందు ఉండే స్వేచ్ఛ పెళ్లి తర్వాత ఉండదు. 

అలాంటి అమ్మాయిల జీవితాల స్ఫూర్తితో ఈ కథ రెడీ చేశా. కానీ కొత్త హీరోయిన్స్​తో అని నిర్మాతలు సందేహించడంతో నేను, నా ఫ్రెండ్స్‌‌ కలిసి నిర్మించాం. అమ్మాయి  అంటే అబల అనే భయంతో కాకుండా అమ్మోరు అనే ధైర్యంతో పేరెంట్స్ వాళ్లను పెంచాలని చెప్పే కథ ఇది. ఇక నా తొలిచిత్రానికి ‘నీలి నీలి ఆకాశం’ లాంటి సూపర్ హిట్ పాటను ఇచ్చిన అనూప్‌‌ రూబెన్స్‌‌, చంద్రబోస్‌‌.. ఈ సినిమా కోసం అలాంటి మరో పాట ఇచ్చారు.  

మరో పది రోజుల్లో దాన్ని విడుదల చేస్తాం’ అని చెప్పాడు.  నటులు భద్రం,  మొయిన్‌‌, సూర్య, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, ఎడిటర్ నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.