బ్యాడ్‌‌‌‌ గాళ్స్‌‌‌‌ మూవీ నుంచి ఇలా చూసుకుంటానే చెలి సాంగ్ రిలీజ్

బ్యాడ్‌‌‌‌ గాళ్స్‌‌‌‌ మూవీ నుంచి ఇలా చూసుకుంటానే చెలి సాంగ్ రిలీజ్

అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, మొయిన్, యశ్నా చౌదరి  లీడ్ రోల్స్‌‌‌‌లో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఫేమ్ మున్నా తెరకెక్కిస్తున్న చిత్రం ‘బ్యాడ్‌‌‌‌ గాళ్స్‌‌‌‌’. కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్‌‌‌‌లైన్.  శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ నిర్మిస్తున్నారు. ఇటీవల మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఇలా చూసుకుంటానే’ పాటను రానా దగ్గుబాటి విడుదల చేసి టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు.  

అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా, సిద్ శ్రీరామ్ పాడిన విధానం ఆకట్టుకుంది. ‘సూర్యుడినే బ్రతిమాలి రావొద్దంటానే  నీకు నిద్ర సరిపోకుంటే.. ఓ సంద్రంలో ఉప్పంతా తొలగించేస్తానే నువ్ స్నానం చేస్తానంటే.. ఇలా చూసుకుంటానే చెలి నిన్ను కలకాలం’ అంటూ సాగిన పాటలో నటీనటుల మధ్య కెమిస్ట్రీ, విజువల్స్ ఆకట్టుకున్నాయి.  ఈ పాటను  జమ్మూ కాశ్మీర్,  మలేషియాలో  చిత్రీకరించినట్టు దర్శకుడు చెప్పాడు.