
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ మూవీ డైరెక్టర్ మున్నా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్యాడ్ గాళ్స్’. 'కానీ చాలా మంచోళ్లు' అనేది ట్యాగ్‌లైన్. శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ నిర్మిస్తున్నారు. ఇందులో అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌లో నటించారు.
లేటెస్ట్గా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 300 మిలియన్లకి పైగా వ్యూస్ దక్కించుకున్న బ్లాక్ బస్టర్ సాంగ్ 'నీలి నీలి ఆకాశం' పాటకు సీక్వెల్ రాబోతున్నట్లు తెలిపారు.
'ఇలా చూసుకుంటానే' అనే లైన్తో సాంగ్ రిలీజ్కి సిద్ధమవ్వగా, చంద్ర బోస్ అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారని మేకర్స్ తెలిపారు. అలాగే, అనూప్ ఇచ్చిన ట్యూన్, సిద్ శ్రీరామ్ స్వరంతో.. 'నీలి నీలి పాట' కంటే గొప్పగా వచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అందుకు తగ్గట్టుగానే ప్రోమో రిలీజ్ చేసి డైరెక్టర్ మున్నా అంచనాలు పెంచేశారు.
Thank u andi @SureshPRO_ Need ur support for our film. #BadGirlz #ilachusukuntane https://t.co/sNVEGcJfUT
— DirectorMunna (@DirectorMunna1) August 20, 2025
ఈ సందర్భంగా డైరెక్టర్ మున్నా మాట్లాడుతూ.. 'ఇలా చూసుకుంటానే' పాట ‘బ్యాడ్ గాళ్స్’మూవీ నుంచి త్వరలో విడుదల చేస్తున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ స్వర పరిచిన ఈ పాటకు చంద్ర బోస్ అందించిన లిరిక్స్, సిద్ శ్రీరామ్ గానంతో పాట అద్భుతంగా వచ్చింది. 'నీలి నీలి ఆకాశం' పాట కంటే గొప్ప అనుభూతి కలిగిస్తుంది. త్వరలో విడుదల చేస్తామని" డైరెక్టర్ మున్నా తెలిపారు.
సినిమా గురుంచి మాట్లాడుతూ..‘బ్యాడ్ గాళ్స్’అనేది పూర్తి ఎంటర్టైనర్ మూవీ. జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రమే మా ‘బ్యాడ్ గాళ్స్’" అని చెప్పుకొచ్చారు.