లంచం తీసుకుంటూ బుక్కైన బుల్లెట్ బండి పెళ్లికొడుకు

లంచం తీసుకుంటూ బుక్కైన బుల్లెట్ బండి పెళ్లికొడుకు

పెళ్లి బరాత్లో బుల్లెట్ బండి సాంగ్తో పాపులర్ అయిన పెళ్లి కొడుకు మరోసారి వార్తల్లో కెక్కాడు. అప్పుడు పాటకు స్టెప్పులేసి పాపులర్ అయితే ఇప్పుడు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. ఓ ఇంటి నిర్మాణం కోసం లంచం అడిగి ఏసీబీకి దొరికిపోయాడు.

జిల్లాలగూడకు చెందిన దేవేందర్ రెడ్డి ఇంటి నిర్మాణ అనుమతుల కోసం బడంగ్ పేట్ మున్సిపాలిటీలో అప్లై చేసుకున్నాడు.అక్కడ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఆకుల అశోక్ పర్మిషన్లు ఇచ్చేందుకు రూ. 30 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని అశ్రయించాడు. దేవేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ సూర్య నారాయణ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన అధికారులు అశోక్ తో పాటు ప్రైవేట్ ఆర్కిటెక్ట్ శ్రీనివాస రాజును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆఫీసర్ అశోక్ తో పాటు మరో నిందితున్ని అధికారులు ఎస్పీఈ అండ్ ఏసీబీ కేసుల కోర్టు ఫస్ట్ అడిషనల్ స్పెషల్ జడ్జి ఎదుట హాజరు పరిచారు. మరోవైపు నాగోల్ లోని రాక్ టౌన్ కాలనీలోని అశోక్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.