ములుగుకు కాంగ్రెస్​ ఏం చేసింది: బడే నాగజ్యోతి

ములుగుకు కాంగ్రెస్​ ఏం చేసింది: బడే నాగజ్యోతి

ములుగు, వెలుగు : కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ ములుగు ప్రజలకు ఏం చేశారని ఇక్కడికి వస్తున్నారని రెడ్కో చైర్మన్ వై.సతీశ్​రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి ప్రశ్నించారు.  మంగళవారం ములుగు లోని లీలా గార్డెన్​లో వారు మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ 60 ఏండ్లలో పాలనలో చేయలేని అభివృద్ధిని సీఎం కేసీఆర్ పదేండ్లలో చేసి చూపించారన్నారు. కాంగ్రెస్ అంటే స్కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. పార్లమెంటు సమావేశాల్లో ట్రైబల్ యూనివర్సిటీ, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా గురించి ఒక్క రోజు కూడా మాట్లాడని రాహుల్ గాంధీకి రామప్పకు వచ్చే అర్హత లేదన్నారు.