
పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారికి ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు బోనం సమర్పించారు. ఆదివారం ఆలయానికి విచ్చేసిన ఆమెకు కమిటీ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఏటా సింహవాహిని అమ్మవారిని దర్శించుకొని, బోనం సమర్పించడం సంతోషంగా ఉందని సింధు ఆనందం వ్యక్తం చేశారు.