పోరాడి ఓడిన సింధు .. ప్రణయ్‌‌‌‌‌‌‌‌, అశ్విని జోడీ కూడా..

పోరాడి ఓడిన సింధు ..  ప్రణయ్‌‌‌‌‌‌‌‌, అశ్విని జోడీ కూడా..

నింగ్బో (చైనా): డబుల్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ మెడలిస్ట్‌‌‌‌‌‌‌‌ పీవీ సింధుకు బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌ ఆసియా చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో చుక్కెదురైంది. గురువారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో సింధు 18–21, 21–13, 17–21తో ఆరోసీడ్‌‌‌‌‌‌‌‌ హన్‌‌‌‌‌‌‌‌ యు (చైనా) చేతిలో ఓడింది. పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ నేపథ్యంలో తెలుగు షట్లర్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌లోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. గంటా 9 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో సింధు ఓ దశలో అద్భుతంగా ఆడింది. తొలి గేమ్‌‌‌‌‌‌‌‌లో 8–4, 14–8 లీడ్‌‌‌‌‌‌‌‌తో ముందుకెళ్లింది. 

కానీ స్మార్ట్‌‌‌‌‌‌‌‌ డ్రాప్స్‌‌‌‌‌‌‌‌తో చైనీస్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ చకచకా పాయింట్లు నెగ్గి గేమ్‌‌‌‌‌‌‌‌ను సాధించింది. రెండో గేమ్‌‌‌‌‌‌‌‌లో దూకుడు పెంచిన సింధు వరుస పాయింట్లతో హోరెత్తించింది. దీంతో 16–8తో వెనుదిరిగి చూసుకోలేదు. డిసైడర్‌‌‌‌‌‌‌‌లో సింధుకు మెరుగైన ఆరంభం దక్కినా మధ్యలో నిరాశపర్చింది. 8–4తో గేమ్‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టిన సింధు ఆ తర్వాత ర్యాలీస్‌‌‌‌‌‌‌‌లో ఎర్రర్స్‌‌‌‌‌‌‌‌ చేసింది. 10–10తో స్కోరు సమం చేసిన హన్‌‌‌‌‌‌‌‌ యు 17–10, 20–17తో దూసుకుపోయింది. మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో హెచ్‌‌‌‌‌‌‌‌.ఎస్‌‌‌‌‌‌‌‌. ప్రణయ్‌‌‌‌‌‌‌‌ 18–21, 11–21తో లిన్‌‌‌‌‌‌‌‌ చున్‌‌‌‌‌‌‌‌ యి (చైనీస్‌‌‌‌‌‌‌‌తైపీ) చేతిలో కంగుతిన్నాడు. విమెన్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప 17–21, 12–21తో నమి మత్సుయమ–చిహారు షిదా (జపాన్‌‌‌‌‌‌‌‌) చేతిలో ఓడారు.