కాంగ్రెస్‌కు ఓటు అడిగే హక్కు లేదు:  బడుగుల లింగయ్య

కాంగ్రెస్‌కు ఓటు అడిగే హక్కు లేదు:  బడుగుల లింగయ్య

నార్కట్​పల్లి, వెలుగు:  60 ఏండ్లు అధికారంలో ఉన్నా అభివృద్ధి పట్టించుకోని కాంగ్రెస్‌కు ఓటు అడిగే హక్కు లేదని ఎంపీ  బడుగుల లింగయ్య యాదవ్​ విమర్శించారు.  శుక్రవారం నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే, బీఆర్‌‌ఎస్‌ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌‌ 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని  తొమ్మిదేళ్లలో చేసి చూపించారన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని చెప్పారు.

లింగయ్య మాట్లాడుతూ.. తనకు మరోసారి అవకాశం ఇస్తే నకిరేకల్‌ను మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం  దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని  పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టెమల్లికార్జున్​ రెడ్డి, ఎంపీపీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, ఎంపీటీసీలు పుల్లెంల ముత్తయ్య, మేకల రాజిరెడ్డి, దుబ్బాక పావని శ్రీధర్ పాల్గొన్నారు.